కట్నం ఇవ్వలేదని కిడ్నీ అమ్మేశాడు!

95

The bullet news(crime)-పుట్టింటినుంచి కట్నం తీసుకురాలేదని ఏకంగా భార్య కిడ్నేనే అమ్మేశాడు ఓ భర్త. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. కట్నం తీసుకురాలేదని భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురయ్యే  బాధితురాలు రీటాకు రెండేళ్ల క్రితం తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దాంతో  భర్త రాకేష్ ఆమెను హాస్పటల్‌కు తరలించాడు. ఆ తర్వాత ఆమెకు అపెండిక్స్ సర్జరీ చేశారు. కొంతకాలానికి బాగానే ఉందనుకున్నతరుణంలో ఆమెకు మరోసారి  కడుపునొప్పి వచ్చింది. దీంతో రీటా  ఓ ప్రైవేట్ నర్శింగ్ హోమ్ లో చేరింది. అయితే డాక్టర్లు  తరచు కడుపునొప్పి రావడానికి గల కారణాలు తెలుసుకునే క్రమంలో ఆమెకు ఒక కిడ్నీ లేదని గుర్తించారు. ఈ విషయాన్ని వారు రీటాకు చెప్పారు. అయితే రెండేళ్ల కిందటే హాస్పిటల్ లో చేర్చిన తన భర్తే  కిడ్నీని అమ్మేసి ఉంటాడని, అనుకుంది. దీంతో భర్తను నిలదీయగా కట్నం డబ్బులు తీసుకురాకపోవడంతోనే నీ కిడ్నీని అమ్మేశానని ఆమెతో అన్నాడు. పైగా ఆ డబ్బులు నీ వైద్యానికే ఖర్చు చేశానని అన్నాడు. భర్త చేసిన దగాపై  రీటా పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదు అందుకున్న పోలీసులు భర్త అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.

SHARE