వాళ్లాయన టీమిండియాకైతే‌.. ఈమె సతీమణుల కెప్టెన్‌!

118

The bullet news (SPORTS)-బాలీవుడ్‌ నటి, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్వాదిస్తోంది. పెళ్లి అనంతరం కోహ్లితో అనుష్కశర్మ దక్షిణాఫ్రికా బయలుదేరిన విషయం తెలిసిందే. కోహ్లితో పాటు, కొత్తగా పెళ్లైన భువనేశ్వర్‌ సైతం తన భార్య నుపూర్‌ కౌర్‌ను తీసుకొచ్చాడు. శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు కూడా తమ సతీమణులను దక్షిణాఫ్రికా తీసుకొచ్చారు. కాస్త విరామం దొరికిన వీరంతా కేప్‌టౌన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ.. ఫొటోలకు ఫోజులిస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేశాయి.

అయితే జనవరి 5 నుంచి తొలి టెస్టు ప్రారంభమవడంతో సతీమణులంతా స్టాండ్స్‌కే పరిమితమయ్యారు. తమ పార్టనర్స్‌కు మద్దతు తెలపుతూ లక్కీఛార్స్మ్‌గా హడావుడీ చేస్తున్నారు. ఈ ఫోటోలకు నెటిజన్లు మైదానంలో ఆటగాళ్లను కోహ్లి లీడ్‌ చేస్తుండగా స్టాండ్స్‌లో ఆటగాళ్ల సతీమణులను అనుష్క లీడ్‌ చేస్తోందని కామెంట్‌ చేస్తున్నారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు అనుష్కా భారత్‌ రానున్న నేపథ్యంలో ధావన్‌ భార్య అయేషా ‘మా ట్రైనింగ్‌ పార్టనర్‌ను చాలా మిస్సవుతున్నామనే’ క్యాఫ్షన్‌తో ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ పిక్‌ సైతం వైరల్‌ అయింది.

SHARE