ఆ ఘనత ఒక్క శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీకే దక్కుతుంది- మంత్రి సోమిరెడ్డి

156

THE BULLET NEWS (NELLORE)- క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు..నెల్లూరు కస్తూరిదేవి స్కూలు ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్లేస్ మెంట్స్ సక్సెస్ మీట్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభా వంతులైన విద్యార్థులకు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యం అందిస్తున్న, సహకారం, ప్రోత్సాహం ప్రశంసనీయమన్నారు.. క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఆయన అభినందన తెలియజేసారు.. ప్రస్తుత జెనరేషన్ లో తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లల చదువులకు కేటాయిస్తుండటం పిల్లల అదృష్టమన్నారు. విద్యార్థులు అత్యాధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని రాష్టానికి ఉపయోగపడాలన్నారు.. క్రమశిక్షణతో మంచి భవిష్యత్ పొందడం ద్వారా తల్లిదండ్రులకు, చదివిన కళాశాలకు, సొంతూరి ఖ్యాతిని తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జమీన్ రైతు చీఫ్ ఎడిటర్ శ్రీ డోలేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు..

SHARE