సింహంలా దూసుకెళ్తున్న కోహ్లి

87

The bullet News (sports) – ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదోస్థానానికి ఎగబాకాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్.. టాప్-5లో చేరాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఆటగాడు జోయ్ రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ మూడోస్థానంలో ఉండగా.. నిలకడకు మారు పేరైన ఛటేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

వార్నర్, విరాట్ మధ్య ఒక పాయింట్ మాత్రమే అంతరం ఉంది. శ్రీలంకతో రెండో టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా సొంత గడ్డ మీద ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడనుంది. దీంతో వచ్చేసారి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించే సమయానికి డేవిడ్ వార్నర్ కోహ్లిని వెనక్కి నెట్టే అవకాశం ఉంది. ఐసీసీ వన్డే, టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

SHARE