ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ కొత్త రికార్డు…

97

The bullet news (Sports)- ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టులో 172 బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. టెస్ట్ కెరీర్‌లో కోహ్లీకిది 22వ సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 287 పరుగులకు ఆలౌట్ కాగా… ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయినా… కెప్టెన్ కోహ్లీ ఒక్కడే నిలబడి సెంచరీ బాదేశాడు… అంతేకాక పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా కెప్టెనె. సారథిగా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. ఈ లిస్ట్‌లో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రెమ్ స్మిత్ 25 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ 19 సెంచరీలతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఇక అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 22 టెస్ట్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 76 ఓవర్లలో 274 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కు భారత్ 13 పరుగులు వెనుకపడి ఉంది. విజయ్ 20, ధావన్ 26, రాహుల్ 4, రహానే 15, పాండ్యా 22, అశ్విన్ 10, షమీ 2, శర్మ 5, యాదవ్ 1 పరుగులు చేశారు. దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యాడు.

SHARE