కోవూరు సిఐ కేసును నీరుగార్చేందుకు య‌త్నిస్తున్నారు.. మాకు న్యాయం చేయండి – మృతుడు గుండాల‌ ప్ర‌సాద్ త‌ల్లి ఆరోప‌ణ‌

67

The bullet news (Nellore)_ క‌ళ్లెదుటే నా కొడుకుని చావ‌బాదారు.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై నా కొడుకు చ‌నిపోయాడు.. న్యాయం చేయాల్సిన పోలీసులు నిందితుల ప‌క్షాన మాట్లాడుతున్నారు.. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక్క‌గానొక కొడుకుని కోల్పోయి రోడ్డున ప‌డ్డాము.. రెండు నెలలు గ‌డుస్తున్నా.. నా కొడుకు హ‌త్య కేసులో నిందితుల‌న్ని అరెస్టు చేయ‌లేదు.. నాకు క‌డుపుకోత‌ను మిగిల్చిన వారు మా క‌ళ్లెదుటే తిరుగుతున్నారు.. మాకు ప్రాణ‌హాని ఉంది.. కోవూరు సిఐ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి కేసును నీరుగార్చేందుకు య‌త్నిస్తున్నారు.. మాకు న్యాయం చేయండంటూ రెండు నెల‌ల క్రితం కొత్త వంగ‌ళ్లులో హ‌త్య‌కు గురైన గుండాల ప్ర‌సాద్ త‌ల్లి ఆరోపించింది..

ఇవాళ నెల్లూరు ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బోరున విల‌పిస్తూ త‌మ కుటుంబానికి న్యాయం చేయాల‌ని వేడుకుంది.. మృతుడు ప్ర‌సాద్ త‌ల్లి మాట్లాడుతూ గ‌త రెండు నెల‌ల క్రితం కొత్త‌వంగ‌ళ్లుకు త‌న కొడుకు గుండాల ప్ర‌సాద్ ను నాగాయ‌కుంట‌కు చెందిన రామ‌చంద్ర‌య్య‌, అత‌ని కుమారుడు మోహ‌న్ తీవ్రంగా గాయ‌ప‌రిచారంది… గుండెల మీద కాళ్ల‌తో త‌న్ని దాడికి తెగ‌బడ్డారు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు రెండు నెల‌లుగా గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కు నిందితుల‌ను అరెస్టు చేయ‌లేద‌ని వాపోయింది.. కోవూరు సిఐ వెంకటేశ్వ‌ర్ రెడ్డి కేసును నీరుగార్చేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించింది.. కేసును రాజీ చేసుకోవాల‌ని త‌మ‌పై ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని, ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న త‌మ‌కు ఎస్పీ న్యాయం చేయాల‌ని ఆమె వేడుకొంది.. వెంట‌నే రామ‌చంద్ర‌య్య‌, మోహ‌న్ ల‌ను అరెస్టు చేయాల‌ని క‌న్నీరుమున్నీరైంది..

SHARE