సకార్యంలో స్వామి కార్యం…

85

THE BULLET NEWS (KOVUR)-కోవూరులో నిన్న జరిగిన ధర్మ పోరాట ధీక్షలో ప్రభుత్వ ఉద్యోగులు తళుక్కున మెరిశారు.. ఎమ్మెల్యే ఆశీస్సుల కోసమో, ముఖ్యమంత్రి అంటే గౌరవమో తెలీదు కానీ ఎమ్మార్వో, ఎంపిడిఓ ధీక్షలో ఉండటంతో ప్రజలు విస్తుపోయారు.. వివిధ సమస్యలను పరిష్కరించాలంటూ కాళ్ళు అరిగెలా తిరిగే సామాన్య జనాన్ని పట్టించుకోని వీరు స్వామి కార్యం కోసం మాత్రం ముందు ఉన్నారు.. దీని మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. విధులకు డుమ్మా కొట్టి మరీ ధీక్షలో కూర్చోవాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు కోవూరు జనం.. స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేసి పిలవడం వల్లే ఎమ్మార్వో, ఎంపిడిఓ వెళ్లారంటూ ఆఫీస్ సిబ్బంది చర్చించుకుంటున్నారు..
మొత్తంగా చూసుకుంటే విధుల కన్నా.. అధికార నాయకుల మెప్పు కోసం ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు వ్యవహారించడం కొసమెరుపు…

SHARE