THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పట్టణంలోని కాపు వీధిలో చోరీ.ఇంటి యజమానులైన అత్తిపల్లి శ్రీనివాసుల రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫంక్షన్ కి 23 తేదీ కావలికి వెళ్లారు. తిరిగి బుధవారం 27 తేదీ ఉదయం ఇంటికొచ్చి చూసేసరికి దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంటికి తాళం వేసిందని గ్రహించిన దుండగులు ఇంటికి వెనక వైపు గల బెడ్ రూమ్ కిటికీ గ్రిల్ ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించి రూమ్లోని బీరువా పగలగొట్టి రెండు కేజీల వెండి రెండు సవర్ల బంగారు ను అపహరించారు .కోవూరు పోలీసులు క్లూస్ టీమ్ నీ పిలిపించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

SHARE