ఆయన వెళ్లారు… ఈయన వచ్చారు…

189

THE BULLET NEWS (KOVUR)-మంత్రి పర్యటన అనగానే స్తానికంగా ఉండే అధికార, మాజీ ఎమ్మెల్యేలు హడావుడి చేస్తారు. మంత్రి తన నియోజకవర్గంలో అడుగుపెట్టింది మొదలు తిరిగి మళ్లీ వెళ్లేదాకా అన్ని దగ్గరుండి చూసుకుంటారు.. స్థానిక సమస్యలను మంత్రి ముందు ఏకరువు పెడతారు.. మంత్రి హామీ ఇచ్చేవరకు వెంటాడుతూనే ఉంటారు.. కానీ కోవూరులో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ ప్రారంభోత్సవానికి వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు.. ఉదయం 9:30 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభమైనా స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సకాలంలో హాజరుకాలేదు.. అందుబాటులో ఉన్నప్పటికీ మంత్రి కార్యక్రమం అయిపోయి ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎమ్మెల్యే హాజరయ్యారు. స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం మంత్రి ద్రుష్టికి సైతం తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించలేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు. ఇంతకీ మంత్రి కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎందుకు ఆలస్యంగా హాజరయ్యారో ఆయనికి, మంత్రికే తెలియాలి..

SHARE