నిబంధనలకు నీళ్లు… పత్రికకు పరిమితమైన విద్యాశాఖ హెచ్చరికలు..

130

THE BULLET NEWS (KOVUR):-నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో సెలవు రోజున స్టడీ అవర్స్‌ పేరుతో ప్రత్యేక తరగతులు. మార్కులు, ర్యాంకుల ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఒత్తిడి లేని విద్య కోసం పండుగల సందర్భంగా ప్రభుత్వం సెలవులు ఇస్తుంటే కార్పొరేట్ పాఠశాలలు వాటిని తుంగలో తొగుకుతున్నాయి. విద్యార్థును ఒత్తిడి చేయడమే ప్రైవేటు పాఠశాల ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.

సెలవు రోజున తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నెల్లూరు జిల్లా కోవూరు మండలం లోని కార్పొరేట్ పాఠశాలలు మాత్రం మా రూటే సపరేట్ అంటున్నారు. దసరా పండుగ సందర్భంగా విద్యాశాఖ ఈ నెల 9 నుండి 21 వరకు ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలకు సెలవులు ప్రకటించారు.కానీ నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని అని కార్పొరేట్ పాఠశాలలు యధావిధిగా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…

స్పందించాల్సిన విద్యాశాఖ అధికారులు నాకు సంభందించిన విషయం కాదంటే, మరొక్కరు పై అధికారులు ఆదేశిస్తే స్పందిస్తామని సమాధానం ఇస్తున్నారు. కోవూరు మండల విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా నాకు ఎటువంటి సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. నెల్లూరు డిప్యూటీ డీఈఓ తెలిజేస్తే డీఈఓ ఆదేశిస్తే స్పందిస్తామని చెప్పారు. పత్రికలలో మాత్రం సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెపిన అధికారులు వాటిని అమలు చేసే విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధంకావడం లేదు.

SHARE