హత్య కేసును చేధించిన కోవూరు పోలీసులు…

99

THE BULLET NEWS (KOVUR)-నెల్లూరుజిల్లా కోవూరుకు చెందిన వాకాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గత నెలమార్చ్ లో దారుణ హత్యకు గురయ్యాడు.. శ్రీకాళహాస్తికి చెందిన వెంకటేశ్వర్లు (30) కోవూరులోని తన బంధువుల ఇంటిలో ఉంటూ కూలిపనులకు వెళ్లేవాడు.. 18వ తేదీ రాత్రి మద్యం తాగి నిద్రిస్తుండగా వెంకటేశ్వర్లు స్నేహితులైన అయ్యప్ప, సాయి, స్వరూపులు మద్యం తాగుదాం రమ్మంటూ తీసుకెళ్లి హత్య చేశారని మ్రుతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూలి డబ్బుల దగ్గర వెంకటేష్ కు , అతని స్నేహితులకు మధ్య గొడవ జరిగిందని, అందులో భాగంగానే కోవూరు సమపంలోని ఎన్టీఎస్ వద్దునున్న తలపై మోది చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

వెంకటేశ్వర్లు స్నేహితులైన సాయి,అయ్యప్ప, స్వరూప్ లపై కేసు నమోదు చేసి కోర్ట్ కి హాజరు పరుస్తామని వివరాలు వెల్లడించిన కోవూరు పోలీసులు.

SHARE