THE BULLET NEWS (KOVUR)-అరుపులు, కేకలు, వాగ్వివాదాల మధ్య పంచాయతీ సమావేశం రసాబాసాగా జరుగుతోంది.. సర్పంచ్ ఉమా వ్యవహారశైలిపై ఉపసర్పంచ్ మల్లారెడ్డి, వార్డు మెంబర్లు పైరయ్యారు.. కార్యాలయానికి వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయంటూ సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఇంతకీ గొడవ ఎందుకు జరిగింది…కోవూరు పంచాయతీలో గత కొన్నినెలలుగా పందులు బెడద తీవ్రంగా ఉంది.. ప్రజల నుంచి వస్తున్న పిర్యాదుల నేపథ్యంలో ఉపసర్పంచ్ మల్లారెడ్డి, వార్డు మెంబర్ల సహకారంతో పందులను తరిమేసేందుకు శ్రీకారం చుట్టారు.. అనుకున్నట్లుగానే వాటిని నివారించేందుకు నడుంబిగిందారు.. ప్రస్తుతం పందుల బెడద కోవూరు పంచాయతీకి తప్పింది.. దానికి సంబంధించిన బిల్లును ఆమోదించలని ఇవాళ పంచాయతీ సమావేశంలో ఉపసర్పంచ్ మల్లారెడ్డి సర్పంచ్ ని కోరారు.. దీంతో సర్పంచ్ ఎవరినడిగి పందుల నివారణకు చర్యలు చేపట్టామని ప్రశ్నించడంతో మల్లారెడ్డికి ఛిరెత్తుకొచ్చింది..
మీరు రోజు కార్యాలయానికి కొస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అర్దమవుతాయి.. అంటూ ఆమెపై మండిపడ్డారు.. దీంతో గొడవ ప్రారంభమైంది..

SHARE