కోవూరు సర్పంచ్ అరెస్టు …

263

THE BULLET NEWS (KOVUR)- నెల్లూరు జిల్లా  కోవూరు మండలం లొ 2013 ఆగస్టు లో  జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూట్ల ఉమా కోవూరు సర్పంచ్  గా ఎన్నికయ్యారు . కోవూరు పంచాయతీ వార్డు మెంబర్లు జిల్లా ఉన్నత అధికారులకు సర్పంచ్ కూట్ల ఉమా తప్పుడు కులధ్రువీకరణ పత్రాన్ని  పెట్టి ఎన్నికయ్యారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గతంలో ఉన్న కలెక్టర్లు ఎంక్వయిరీ చేసి   ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోవూరు తహశీల్దార్ ను ఆదేశించారు. దీనిపై సర్పంచ్ కూట్ల ఉమా హైకోర్టు లో  అపీల్ చేశారు. హైకోర్టు దీనిని తిరస్కరించి  ప్రభుత్వం కు అపీల్ చేయాలని ఆదేశించారు. కోట్ల ఉమా ప్రభుత్వంకు ఆపిల్ చేయగా మూడు సంవత్సరాల తరువాత ఆమె ఎస్టీ కాదు అని నిర్ధారించారు. ఈ విషయమై గవర్నమెంట్  జీవో ఇష్యూ  చేసి కలెక్టర్ కు ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు జిల్లా పంచాయతీ అధికారికి, కోవూరు మండల తహసీల్దార్ కి ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు కోవూరు పోలీసులు సర్పంచ్  ఉమాను అరెస్టు చేశారు. పోలీసులు ఆమెను కోవూరు కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించారు.

SHARE