మాటల తూటాలు పేల్చిన పెళ్లకూరు…

176

THE BULLET NEWS  (NELLORE) –

నెల్లూరులో జరుగుతున్న టీడీపి మహానాడు సభలో కోవూరు నియోజకవర్గ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. టిడిపిని నమ్ముకుని ఉన్న వారిని పట్టించుకోకుండా కొందరు వ్యవరిస్తున్నారని ఆయన ఆరోపించారు.. పార్టీలో
తామే గొప్ప అన్న విధంగా పార్టీలో కొంతమంది వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందరిని కలుపుకుని వెళ్లాల్సిన వారు ఒంటెద్దు పోకడలు అవలంబిస్తున్నారని దానివల్ల భవిష్యత్ లో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు.. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు తాము ఉన్నామనే భరోసా ఇచ్చే నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో పెళ్లకూరు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి..

SHARE