కృష్ణాజిల్లా పశుగణాభివృధ్ధి నూతన కమిటీ ఎన్నిక.. చైర్మన్ గా నాగేంద్ర కుమార్

73

The bullet news (Gannavaram) – కృష్ణాజిల్లా పశుగణాభివృధ్ధి సంస్థ కార్యలయంలో కృష్ణాజిల్లా నూతనకమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. పశుగ్రానాభివృద్ధి సంస్థ చైర్మన్ గా కైకలూరు మండలానికి చెందిన కొత్త. నాగేంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి గా పశుగణాభివృద్ద సంస్థ డీ.డీ కామేశ్వర పంతు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన ప్యానల్ పదవీకాలం 5ఏళ్ల పాటు కొనసాగనుంది. చైర్మన్, సభ్యులకు నియామక పత్రాలను ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అందజేశారు. అనంతరం నూతన చైర్మన్ నాగేంద్ర కుమార్ ని ఎమ్మెల్సీ అర్జునుడు సన్మానించారు.ఈకార్యక్రమంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ పాల్గొన్నారు.

SHARE