మంత్రి సోమిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రిని క‌లిసిన కృష్ణ‌ప‌ట్నం, ముత్తుకూరు ప్రాంత రైతులు

165

The bullet news (Amarvathi)-  నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం, ముత్తుకూరు రైతులు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు.. తమ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు.. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కృష్ణ‌ప‌ట్నం, ముత్తుకూరు ప్రాంత రైతులు దాదాపు 150మంది త‌న ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రిని క‌లిశార‌న్నారు.. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, త‌దిత‌ర విష‌యాల‌ను చంద్ర‌బాబు దృష్ట‌కి తీసుకొచ్చార‌న్నారు.. రైతులు విన్న‌వించిన వాటిపై ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు..

SHARE