THE BULLET NEWS (GUDUR) -ఆ ఎమ్మెల్యే స్టయిల్ మార్చారు.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు.. ప్రజలతో మమేకమవుతున్నారు.. వెళ్లిన ప్రతి చోటా ప్రజలని కలుస్తూ స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.. ఇంట్లో మనిషిగా అందరితో కలిసిపోతున్నారు.. మొన్నటి మొన్న టీ దుకాణం వద్ద టీ తాగుతూ కనిపించిన ఆయన తాజాగా కత్తి పట్టి మట్టి పనులకు దిగారు..

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ నియోజకవర్గ ప్రజల్లో విస్రుతంగా తిరుగుతున్నారు.. ఇంటింటికి తిరుగుతున్నారు.. తెలుసుకున్న సమస్యలను అక్కడితో వదిలేయకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు శ్రమిస్తున్నారు.. ఇవాళ గూడూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డులను పంపిణీ చేశారు.. అంతకు ముందు అక్కడుంటే కూలీలతో కలిసి పనిచేశారు.. కత్తి పట్టి కంపచెట్లను తొలగించారు.. అందరూ ప్రజాప్రతినిధుల్లా అలా వచ్చి కార్యక్రమం అవ్వగానే ఇలా వెళ్లకుండా కాసేపు వాళ్లతో కలిసి పనిచేశారు.. పనిచేసే సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.. ఎమ్మెల్యే కత్తి పట్టి కంపచెట్లను తొలగిస్తుండటంతో అక్కడుంటే కూలీలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.. ఇంత మంది ఎమ్మెల్యేలను చూశాము గానీ తమతో పాటు పనిచేసి తమ కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్న ఎమ్మెల్యేను చూడటం మొదటిసారంటూ అక్కడుంటే కూలీలు చర్చించుకున్నారు.. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీలో రూ.35లక్షలతో నిర్మిస్తున్నకాలేజీ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ బొల్లినేని కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు..

SHARE