మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన యువతులు

117

THE BULLET NEWS(Hyderabad)- మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు యువతులు అతిగా మద్యం సేవించి కార్లు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే… బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలకు సహకరించకుండా ట్రాఫిక్‌ పోలీసులకు యువతులు చుక్కలు చూపించారు. అంతేగాక కొందరు యువతులు పోలీసులపైకి తిరగబడడం గమనార్హం. కాగా… 4 కార్లను పోలీసులు సీజ్‌ చేయగా 14మందిపై కేసులు నమోదు చేశారు.

SHARE