టి-ఎన్నికలపై లగడపాటి సర్వే ఎప్పుడో తెలుసా..?

93

The bullet News (political)-  ఎన్నికలు అనగానే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే కోసం రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్నికల ఫలితాలను తన సర్వేలతో సరిగ్గా అంచనా వేయడంలో లగడిపాటి దిట్ట. గతంలో చాలా సందర్భాల్లో లగడపాటి చెప్పింది చెప్పినట్టుగానే ఫలితాలొచ్చాయ్‌. తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా లగడపాటి రాజగోపాల్‌ అంచనా తప్పలేదు.

ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎవరికి విజయావకాశాలున్నాయి అని ప్రశ్నించగా..  ప్రస్తుత తరుణంలో తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పడం సబబు కాదంటూనే.. మరికొన్ని రోజుల్లో తన అభిప్రాయాన్న వెల్లడిస్తానని చెప్పారు.

కొన్ని నియోజకవర్గాల మినహా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రకటించగా.. మరో వారం రోజుల్లో కాంగ్రెస్‌ కూడా 60 మందితో తొలి జాబితా వెలువరిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ జాబితా వచ్చాక లగడపాటి తన సర్వే వివరాలను తెలియజేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

SHARE