భూ మాయలోళ్లు

68

The bullet news(nellore) – నగరపాలక సంస్థ పరిధిలో విలువైన ఖాళీ స్థలాలు ఉన్నాయి. అందులో చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. తెదేపా కార్యాలయం ఎదుట, మినీ బైపాస్‌ రోడ్డు, కొండాయపాలెం, రామ్మూర్తినగర్‌, మాగుంట లే అవుట్‌లలో స్థలాలు.. ఇలా ఖరీదైన స్థలాలు నగరపాలక సంస్థ రికార్డుల్లో కనిపిస్తున్నాయి. చాలా చోట్ల అవి ఆక్రమణకు గురయ్యాయి. ఇతర రకాలుగా కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. అధికారుల రికార్డుల ప్రకారం 140 చోట్ల ఖాళీ స్థలాలు ఉండాల్సి ఉంది. అందులో ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయమై నగరపాలక సంస్థ సిబ్బందికే తెలియని దయనీయ పరిస్థితిలో ఉంది.

*మినీబైపాస్‌ ఆనుకుని ఉన్న పిచ్చిరెడ్డి కళ్యాణమండపం ఎదురు ఇటీవల హద్దు గోడలు.. ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి స్థలానికి సంబంధించి అతనికి ఎలాంటి హక్కులు నగరపాలక సంస్థ కట్టబెట్టలేదని గతంలో కమిషనర్‌గా పనిచేసిన ఢిల్లీరావు స్పష్టంగా నివేదికను ప్రభుత్వానికి పంపారు. స్థలాన్ని మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేయటానికి వీలుగా గత ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు తీసుకున్న ఒక వ్యక్తి.. అధికారులు నిర్దేశించిన ధర మేరకు రూ.3 కోట్ల మొత్తాన్ని నగరపాలక సంస్థకు చెల్లించారు. ఈ మేరకు స్టాండింగ్‌ కమిటీ కూడా అంగీకారం తెలిపింది. కానీ, అతని పేరిట ఎలాంటి హక్కు పత్రాలను నగరపాలక సంస్థ అప్పగించలేదు.
* కొన్ని స్థలాలు ఇప్పటికీ వివాదాల్లో ఉన్నాయి. లక్ష్మీపురంలో ఒక స్థలం వివాదంలో ఉంది. మినీబైపాస్‌ అనుకుని అనిల్‌గార్డెన్‌ దగ్గర గతంలో ఒక స్థలం వివాదాస్పదంగా మారింది. గోమతినగర్‌లో కూడా సుమారు ఎకరం విస్తీర్ణం ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తుంటే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.        నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం వినియోగించాలి. కానీ, వాటికి ధర నిర్దేశించుకుని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వు తెచ్చుకోవటం.. తక్కువ ధర నిర్దేశించుకోవటం.. హక్కులు కల్పిలంచుకోవటం జరుగుతోంది. గతంలో ఇదే తీరులో మొత్తం ఖాళీ స్థలాలు మాయం అవుతూ వచ్చాయి. నగరపాలక సంస్థ 2014లో సర్వే చేయిస్తే.. 171 ఖాళీ స్థలాలు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం వాటి సంఖ్య 140కి చేరింది. అంటే 31 స్థలాలు కరిగిపోయాయి.                                                                                                                                                                                                                                                                                                                                                                         నగరపాలక సంస్థ అధికారులు ఈ స్థలాలు మనవి కాదులే అన్నట్లు వదిలేశారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారి(సీపీ) సూరజ్‌ను ఖాళీ స్థలాల గురించి అడిగితే.. ఎన్ని స్థలాలు ఉన్నాయనే విషయం లెక్కలు ఉన్నాయని మాత్రమే చెబుతారు. అందులో కోర్టు వివాదాల్లో ఎన్ని ఉన్నాయంటే.. లెక్క వేసుకోవాలంట! ఎన్ని కబ్జాల్లో ఉన్నాయంటే.. వెళ్లి పరిశీలించాలట! అంటే విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించి రికార్డులను నిర్వహించే స్థితిలో అధికారులు లేరు. వాస్తవానికి కోర్టు కేసులకు సంబంధించి పక్కాగా రికార్డులు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇలాంటి వాటిని సంబంధిత అధికారులు నిర్వహిస్తున్న దాఖలా లేదు.

SHARE