కర్ణాటక ఎవరిది..? లేటెస్ట్ సర్వే…

128

THE BULLET NEWS (BANGALORE)- కర్నాటకలో అధికారం మళ్లీ కాంగ్రెస్ హస్తగతం అవుతుందా? లేక కమలం విరబూస్తుందా? మే 12న జరిగే ఎన్నికల్లో జనం ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. మోడీ, రాహుల్ ప్రచారాలు ఆయా పార్టీలకు ఏ మేరకు కలిసొస్తున్నాయ్..? వీటిపై ఫ్లాష్ టీమ్‌తో కలిసి ఓ లీడింగ్ ఛానెల్ సర్వే చేపట్టింది. ఆ ఎక్స్‌క్లూజివ్ సర్వే రిపోర్ట్  ఇప్పుడు చూద్దాం.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం..!!

సిద్ధరామయ్య పాలన బాగుంది-50.73%, బాగాలేదు – 49.27%
లింగాయత్‌లకు మైనార్టీ హోదా ఇవ్వాలి- 38.89%, వద్దు- 61.11%
బీజేపీకి ఓటు వేస్తామని సర్వేలో చెప్పిన 37.78 శాతం ప్రజలు
కాంగ్రెస్- 34.17%, జేడీఎస్‌ – 21.34%, ఇతర పార్టీలు – 6.71% ఓట్లు
సర్వేలో సీఎంగా యడ్యూరప్పకి- 38.11%, సిద్ధరామయ్య- 37.03%
హెచ్‌.డి.కుమారస్వామి సీఎం కావాలనుకుంటోంది 18.33 శాతమే
ప్రధానిగా నరేంద్రమోడీకి -55.35%, రాహుల్‌ గాంధీ -44.65%
కర్నాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు- 224
బీజేపీ 115 సీట్లకు అటుఇటుగా గెలుస్తుందని సర్వే అంచనా
కాస్త అటుఇటుగా కాంగ్రెస్‌కి- 70, జేడీఎస్‌ – 40 సీట్లు వచ్చే ఛాన్స్
కర్నాటకలో గత ఎన్నికల్లో 72 శాతం పోలింగ్‌
ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగితే బీజేపీకే అనుకూలం
అక్షరాస్యులు, మధ్యతరగతి ఓటర్లలో బీజేపీకి 10 శాతం ఎక్కువ ఆదరణ
రూ.లక్ష రుణమాఫీ, మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ప్రభావం చూపే ఛాన్స్‌

SHARE