ప్రభుత్వం అదిరిపడేలా జగనన్న సభను విజయవంతం చేద్దాం – వైసీపీ విద్యార్ది విభాగం నాయకులు

119

The bullet news (Venkata chalam) – చంద్రబాబు అదిరిపడేలా.. తెలుగుదేశం ప్రభుత్వం వణికేలా ఈ నెల 31న పొదలకూరులో నిర్వహించబోతున్న వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నెల్లూరుజిల్లా వైసీపీ విద్యార్ది విభాగం ప్రధాన కార్యదర్శి పెంచల నాయుడు పిలుపునిచ్చారు.. వెంకటాచలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు.. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ వస్తోందన్నారు.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ నెల31న సర్వేపల్లి నియోజకవర్గంలోని డేగాపూడికి జగన్ రానున్నారన్నారు.. పొదలకూరులో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పెంచల నాయుడు కోరారు.. మధ్యాహ్నం గం.3లకు ప్రారంభమయ్యే ఈ భారీ బహిరంగ సభను ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాజశేఖర్, ప్రవీణ్, విజయరెడ్డి, వంశీ, శ్రీదర్, ప్రతాప్, మహేష్, ప్రసాద్, శ్రీనాథ్ పాల్గొన్నారు..

SHARE