రండి.. ఏబీవీపి రాష్ట మహాసభల్ని జయప్రదం చేద్దాం – ఏబీవీపి జిల్లా కన్వీనర్ మనోజ్

77

The bullet news (Gudur)-  విద్యార్దుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏబీవీపి ఈ నెల 26,27,28న రాజమండ్రిలో నిర్వహించే రాష్ట మహాసభలను జయప్రదం చేయాలని ఏబీవీపి జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు.. గూడూరులోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన ఏబీవీపి నాయకులతో కలిసి ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్యరంగ సమస్యలు చర్చించేందుకు ఏబీవీపి నిర్వహించే రాష్ట మహాసభ సరైన వేదికన్నారు.. విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్దుల ఆత్మహత్యలు, విద్యరంగ సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆతీర్మానాన్ని ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.. ఈ మహాసభలకు మేధావులు, విద్యావేత్తలు వస్తున్నారని గూడూరు నుంచి విద్యార్దులు పాల్గొని సభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో ఏబీవీపి నాయకులు రవి, సూర్య, సుమంత్, కోటయ్య పాల్గొన్నారు..

SHARE