అదికార పార్టీ ద్వంద వైఖ‌రిని ఎండ‌గ‌డ‌దాం – స‌మావేశంలో జ‌గ‌న్

41

The bullet news (Nellore)- నెల్లూరుజిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దకొండూరులో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యాయి.. ప్రధానంగా కేంద్ర బడ్జెట్, స్పెషల్ స్టేటస్ పై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ఈ అత్యవసర సమావేశానికి ఎంపీలు మిధున్ రెడ్డి, వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిలతో పాటు రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య్ సాయి రెడ్డి , పార్టీ కో ఆర్డినేటర్లు ధర్మాన, మేకపాటి గౌతమ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకిష్ణారెడ్డిలు హాజరయ్యారు.. స్పెషల్ స్టేటస్ తో పాటు, కేంద్ర బడ్జెట్ పై తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టి జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. అందుగానూ ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు పార్టీ వర్గాల సమాచారం..

SHARE