మీ అంద‌రికీ ఇష్ట‌మైతేనే లెద‌ర్ కాంప్లెక్స్ ను ఆహ్వానిద్దాం – గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్

115

The bullet news (Kota)_ ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటైతే యువ‌త‌కు ఉద్యోగాలొస్తాయి.. భూముల‌కు ప‌రిహారం వ‌చ్చేలా కృషిచేస్తా.. మీ అనుమ‌నాలేంటో చెప్పండి అంటూ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కోట మండలం కొత్తపట్నం పంచాయతీ వాసుల‌తో మాట్లాడారు.. ఇవాళ‌ కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ పై గ్రామస్థులుకు అవగాహనా సదస్సును ఆయ‌న ఏర్పాటు చేశారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న స్థానికుల స‌మ‌స్య‌ల‌ను నివృత్తి చేశారు.. ప‌రిశ్ర‌మ ఏర్ప‌డ‌టం వ‌ల్ల యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలొస్తాయ‌న్నారు.. రైతులు కోల్పోయిన భూముల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే విధంగా కృషి చేస్తాన‌న్నారు.. ఇవేమీ జ‌ర‌గ‌ని నేప‌థ్యంలో మీకు నేనే అండ‌గా ఉంటాన‌ని పంచాయ‌తీ వాసుల‌ను ఉద్దేశించి మాట్లాడారు.. అన్యాయం జ‌రిగితే అవ‌స‌ర‌మైతే ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కైనా వెళ్లి స‌మస్య‌లు ప‌రిష్క‌రించేందుకు ముందుంటాన‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్డీవో అరుణ్ బాబు,ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య, ఎఎంసీ చైర్మ‌న్ పాపారెడ్డి మనోజ్ రెడ్డి, జ‌డ్పీటీసీ ప్రసాద్ గౌడ్, మండ‌ల నాయ‌కులు పాల్గొన్నారు..

SHARE