చిన్న‌త‌నం నుంచే అమ్మ‌ను ప్రేమిద్దాం- వృద్దాప్యంలో వారికి అండ‌గా నిలుద్దాం – వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా

130

The bullet news (Venkatagiri)_ సృష్టిలో అంద‌మైన ప‌దం అమ్మ‌.. అలాంటి అమ్మ గొప్ప‌ద‌నం చిన్న‌త‌నం నుంచే పిల్ల‌ల‌కు తెలియానే ఉద్దేశ్యంతోనే అమ్మ‌కు వంద‌నం కార్య‌క్ర‌మాన్నినిర్వహిస్తున్న‌ట్లు వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా బాల‌కృష్ణ అన్నారు.. ప‌ట్ట‌ణంలోని జ‌డ్పీ హైస్కూల్ లో అమ్మ‌కు వంద‌నం కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఆమె విద్యార్దుల‌కు అమ్మ గొప్ప‌ద‌నం గురించి వివ‌రించారు..త‌ల్లి గొప్ప‌ద‌నం చిన్న‌తనం నుంచే పిల్ల‌ల‌కు తెలియజేయ‌డమే ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశ్య‌మ‌న్నారు.. తల్లిని ప్రేమించిన ప్ర‌తి ఒక్క‌రూ స‌మాజంలో ఉన్న‌త స్థానాల్లో ఉన్నార‌న్నారు.. త‌ల్లి వృదాప్యంలో ఉన్న‌ప్పుడు ఆమెను కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌నమీదే ఉంద‌న్నారు.. అలాంటి చూసుకున్న‌ప్పుడే వృద్దాశ్ర‌మాలు లేని స‌మాజాన్ని చూడొచ్చ‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్దులు, వాళ్ల తల్లులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

SHARE