ఊహ‌కంద‌ని ఊచ‌కోత‌ను ఖండిద్దాం.. బ‌ర్మా ముస్లీముల‌కు అండ‌గా నిలుద్దాం – రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి

118

The bullet news (Nellore)- చిన్నారుల‌నే క‌నిక‌రం లేకుండా చిదిమేశారు.. మ‌హిళ‌ల‌పై అత్యాచారుల‌కు తెగ‌బ‌డ్డారు.. పురుషుల‌ను వెంటాడి వేటాడి మ‌రీ ఘోర‌క‌లికి తెగ‌బ‌డ్డారు.. కంటికి క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రినీ ఊచ‌కోత కోశారు. బ‌ర్మా ముస్లీముల‌పై దాడికి తెగ‌బ‌డిన తీరు చూస్తేంటే గుండెలోతుల్లో నుంచి వ‌స్తున్న ఆవేద‌న‌ను ఆపుకోలేక పోతున్నానంటూ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి చ‌లించిపోయారు.. బ‌ర్మా ముస్లీముల‌పై మ‌య‌న్మార్ సైన్యం ఊచ‌కోత‌కు నిర‌స‌న‌గా నెల్లూరులోని ఆర్టీసీ బ‌స్టాండ్ వ‌ద్ద సంఘీబావ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఆవేద‌న‌ను ఓ పాట రూపంలో వ్య‌క్త ప‌రిచారు.. ఈ న‌ర‌మేదంపై అమెరికా జోక్యం చేసుకోవాలన్నారు.. బర్మా ముస్లిం లపై దాడి.. సర్వ మానవాళి పై దాడిగా ఆయన అభివర్ణించారు. శ్రీలంక, ఇరాక్ దేశాలకు సైనికులను పంపిన భారత్. మ‌న సైన్యాన్ని పంపి ముస్లీముల‌ను ర‌క్షించాల‌ని కోరారు.. ఈ వ్యవహారాన్నిఇప్పుడు పట్టించుకోకపోతే మరో దేశం లో మరో కమ్యూనిటి పై కూడా ఇదే తరహ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. ఈ కార్య‌క్ర‌మానికి కుల‌మ‌తాల‌కు అతీతంగా శ్రీధ‌ర్ రెడ్గి పిలుపుతో ఆయ‌న అభిమానుల‌, ముస్లీం యువ‌కులు, మ‌త పెద్ద‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు..

SHARE