దొంగ‌బాబాల‌ను త‌రిమికొడ‌దాం- నెల్లూరులో జేవీవీ నాయకుల ర్యాలీ

106

The bullet news (Nellore)- దేశంలో బాబాల ముసుగులో చ‌లామ‌ణి అవుతూ ఆకృత్యాల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌బాబాల‌పై ప్ర‌భుత్వాలు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జ‌న విజ్ణాన వేదిక భారీ ర్యాలీ చేప‌ట్టింది.. న‌గ‌రంలోని గాంధీబొమ్మ సెంటరు నుంచి సర్వోదయ కళాశాల వరకు నిర్వహించే ఈ ర్యాలీలో జేవీవీ కార్య‌క‌ర్త‌లు భారీగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న విజ్ణాన వేదిక అధ్యక్షులు బుజ్జయ్య మాట్లాడుతూ డేరా బాబా ఆస్తుల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌న్నారు.. బాబాల‌కు ప్ర‌భుత్వాలు క‌ల్పించే జ‌డ్ క్యాట‌గిరీని ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.. దేశంలో ఉండే దొంగ‌బాబాల‌ను ప్ర‌భుత్వాలు క‌ఠినంగా శిక్షించాలన్నారు..

SHARE