స్వచ్ఛసర్వేక్షన్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధిద్దాం.. నగరానికి నిధులు రాబడదాం – మేయ‌ర్ అబ్దుల్ అజీజ్

228

The bullet news (Nellore)_ పారిశుధ్యంపై అవగాహన పెంచుకుని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛసర్వేక్షన్ ఫలితాల్లో నెల్లూరు కార్పోరేషనుకు ఉత్తమ ర్యాంకును సాధించేందుకు సహకరించాలని మేయరు అబ్దుల్ అజీజ్ నగర ప్రజలను కోరారు. నగరంలో స్వచ్చ సర్వేక్షన్ సర్వే ప్రారంభాన్ని పురస్కరించుకుని కార్పోరేషను ఆఫీసులో సర్వే ప్రతినిధులతో మేయర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రతినిధులు దేశంలోని 4041 మున్సిపాల్టీల్లో పర్యటించి ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరిస్తారనీ, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతపై నెల్లూరు నగరవాసులు చైతన్యం పెంచుకోవాలని కోరారు.. స్వచ్ఛ సర్వేక్షన్ ఫలితాల ర్యాంకు ఆధారంగా నగరాభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వందలోపు ర్యాంకు సాధించి మంచి నిధులను పొందేందుకు కృషి చేద్దామన్నారు.. నిర్దిష్ట సమయంలోపు ప్రతినిధులు కోరే రికార్డులూ, దస్త్రాలను వారికి సమర్పించి సర్వే కార్యక్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలని కార్పోరేషను అధికారులను మేయరు ఆదేశించారు. సమావేశంలో కార్పోరేషను కమిషనరు అలీం బాషా, ఎస్సీ రవికృష్ణ రాజు, ఆరోగ్యాధికారి అమరేంద్ర నాథ్ రెడ్డి, అధికారులు పాయసం వెంకటేశ్వర్లు, కార్పొరేటరు ప్రశాంత్ కిరణ్, కార్వే కంపెనీ, క్లీన్ సిటీ ఫౌండేషన్ కన్సల్టేన్స్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.