మ‌రింత క‌ష్ట‌ప‌డి ప‌నిచేద్దాం -ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

106

The bullet news (Nellore)-  ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగేందుకు కృషి చే్స్తున్న నేత‌ల‌కు, టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కుల‌కు, యాప్ ఆప‌రేట‌ర్ల‌కు మాజీ మంత్రి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ స‌మ‌న్వ‌యక‌ర్త ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కృత‌జ్ణ‌త‌లు తెలిపారు.. నెల్లూరు సంత‌పేట‌లోని త‌న నివాసంలో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య‌నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డోర్ టు డోర్ టీడీపీకి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ‌ స్పంద‌న వ‌స్తోంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌న్నారు.. మ‌రింత ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌న్నారు.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌న్నారు. సంపూర్ణ లక్ష్యసాధనకు మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌న్నారు.. అందుకు సంబంధించి కొన్ని సూచ‌న‌లు చేశారు..

SHARE