నేడు వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం…

74

THE BULLET NEWS (NEW DELHI)-వైసీపీ ఎంపీల రాజీనామాలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ నేడు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాన్నం 2 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా పార్లమెంటరీ బృందం 10 రోజుల పర్యటనకుగాను లాత్వియా, బెలారస్ కు వెళ్లనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో వైసీపీ ఎంపీల రాజీనామాలను 12 గంటలకల్లా ఆమోద ముద్ర వేయొచ్చని లోక్ సభ సచివాలయ సిబ్బంది తెలిపింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతకం చేసిన నాటి నుండే రాజైనామాల ఆమోదం అమల్లోకి వస్తుందని సమాచారం. స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఉప ఎన్నికలు ఉండకపోవచ్చని సచివాలయ సిబ్బంది అంటున్నారు.

మే 18న 16వ లోక్ సభ ఏర్పడింది. తొలి సమావేశం జూన్ 4న జరిగింది. అయితే లోక్ సభ ఏర్పడిన నాటి నుంచి ఏడాదిలోపు సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే.. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని లోక్ సభ సచివాలయ సిబ్బంది అభిప్రాయపడ్డారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోద ముద్ర వేసిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఐదు స్థానాలు ఖాళీ అయినట్టు ఎన్నికల సంఘానికి సమాచారం పంపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఏపీ వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందించిన విషయం తెలిసిందే.

SHARE