రైల్వే ట్రాక్ పైకి దూసుకుపోయిన లారీ.. 4 గంటలపాటు నిలిచిన రైళ్లు…

188

THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పై అదుపుతప్పి పడిన లారీ.. ఎటువంటి ప్రాణాపాయం లేకపోయినపటికి రైలు రాకపోకలు నిలిచిపోయాయి..

చెన్నై నుండి విజయవాడకు వెళుతున్న సర్వో ఇంజన్ ఆయిల్ లోడెడ్ వాహనము కోవూరు లారీ ఎర్డ్ సమీపంలో అదుపుతప్పిన లారీ రైల్వే ట్రాక్ పైకి దూసుకుపోయింది… ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం లేదు…

కానీ రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పడుగుపాడు రైల్వే స్టేషన్ లో రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ 40 నిమిషాలపాటు నిలిచింది. కొడవలూరు స్టేషన్ లో శబరి ఎక్స్ ప్రెస్ 4 గంటలపాటు నిలిచింది.అలాగే బిట్రగుంట లో పాండిచెర్రీ ఎక్స్ ప్రెస్,
ఉలవపాడు లో మరో ఎక్స్ ప్రెస్,
కావలి లో తిరుపతి ప్యాసింజర్ దాదాపు 4 గంటల సేపు నిలిచిపోయాయి… దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు..

SHARE