మైపాడు గేట్ వద్ద లారీ భీభత్సం..పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం.

148

THE BULLET NEWS (NELLORE)-సామాన్యులకు న్యాయం చెయ్యాల్సిన పోలిసులు రాజీమార్గాలకు తెరలేపుతున్నారు.. లారీ భీభత్సం సృష్టించి కూడు, గూడు, జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డ వారిని అడుకోవాల్సిన ఖాకీలు.. లారీ ఓనర్ ఎంతో కొంత ఇస్తారులే కేసులెందుకు అంటూ రాజిమార్గానికి తెరలేపారు.. అసలు విషయానికి వస్తే ఇవాళ ఉదయం నెల్లూరులోని మైపాడు గేటు వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.. తప్పతాగిన క్లినర్ లారీ నడిపి రెండు ఇళ్లను, ఓ ఆటోను ధ్వంసం చేశారు.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు బోరుమంటున్నారు.
రంగప్రవేశం చేసిన పోలీసులు క్లినర్ ను అదువులోకి తీస్కున్నారు.. కేసు నమోదు చెయ్యకుండా డబ్బులిస్తారు.. రాజీ చేసుకోండి అంటూ టు టౌన్ పోలీసులు మాట్లాడుతున్నారని బాధితులు మండిపడుతున్నారు..

SHARE