వెంకటగిరి పోలీసుల్ని ఆశ్రయించిన ప్రేమ జంట

173

The bullet news (Venkata Giri) -వెంకటగిరి పట్టణంలోని రాజవిధిలో ఉన్న పోలీసు కార్యాలయం నందు రక్షణ కోరుతూ శుక్రవారం ఉదయం ఒక ప్రేమ జంట పొలీసులు ని ఆశ్రయించినారు. ప్రేమజంట అందించిన వివరాలు ఇలావున్నాయి వెంకటగిరి కి చెందిన షఫీ,అనంతపురం కి చెందిన సరస్వతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సరస్వతి శ్రీ కాళహస్తీలోని SV ఉమెన్స్ కళాశాలలో పిజి చదువుతున్నదని, మేమిద్దరం మేజర్లు అని తెలిపారు. మా ప్రేమ వ్యవహారం ఇరువురి ఇళ్లలో తెలిసి పెళ్లికి అంగీకరించకపోవడం తో ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసిన ఇరువురి బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మాకు రక్షణ ఇవ్వాల్సింది గా ప్రేమజంట(షఫీ,సరస్వతి) వెంకటగిరి పోలీసులుని ఆశ్రయించారు. వెంకటగిరి పోలీసుల సమాచారం ప్రకారం వారిఇరువురిని తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కాళహస్తి పోలీసు స్టేషన్ కి పంపుతున్నామని తెలిపారు.

SHARE