మ‌హాధ‌ర్నా వాయిదా… 6లోపు నీరు విడుద‌ల చేయ‌క‌పోతే పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తాం – జ‌డ్పీ చైర్మ‌న్

84

The bullet news (Venkata Giri)_ కండలేరు జలాశయము నుంచి రైతులకు నీరు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ రేపు వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి త‌ల‌పెట్టిన మ‌హాధర్నాకార్య‌క్ర‌మం వాయిదా వేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.. వెంక‌ట‌గిరిలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బొమ్మిరెడ్డి మాట్లాడుతూ రైతుల‌కు నీరు విడుద‌ల చేయ‌క‌పోతే పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హిస్తామ‌ని మ‌హాధ‌ర్నాకు పిలుపునివ్వ‌డంతో ప్ర‌భుత్వం, అధికారుల్లో క‌ద‌లిక వచ్చింద‌న్నారు.. ఈ నెల 6వ తేదీలోపు నీటిని విడుద‌ల చేయ‌క‌పో్తే వాయిదా వేసిన ధ‌ర్నాను రైతుల‌తో క‌లిసి పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.. నీటి విడుద‌ల్లో కూడా రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు.. ఈ కార్యక్ర‌మంలో ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు డిల్లీబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు..

SHARE