జన్మభూమిని అందరూ సద్వినియోగం చేసుకోండి ‍… వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా..

99

The bullet news (Venkata Giri)_ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ మా ఊరు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా కోరారు.. ఇవాళ వెంకటగిరి 5వార్డులోని కాలేజీమిట్ట లో ఐదో విడత జన్మభూమి‍= మా ఊరు కార్యక్రమం జరిగింది . ఈ సందర్బంగా చైర్ పర్సన్ దొంతు శారదా పేదలకు రేషన్ కార్డులు. చంద్రన్న బీమా కానుకలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు.. నాలుగు విడతలు విజయవంతమైన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల సమస్యల సత్వర పరష్కారం కోసం ఐదో విడత కూడా చేపట్టారన్నారు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బీరం రాజేశ్వరావు, 5వార్డ్ కౌన్సలర్ మల్లారం లక్ష్మీ , టీడీపీ కౌన్సలర్స్, నాయకులు, వార్డ్ ప్రజలు, పాల్గొన్నారు.

SHARE