పిడుగుతోనే సెల్ఫీయా.. వ్యక్తి దుర్మరణం!

51

The bullet news (Chennai)- ఎడతెరిపిలేకుండా ఉరుములు, మెరుపులతో వర్షం.. పైగా భారీఎత్తున ఆకాశంనుంచి పడుతున్న పిడుగులు.. ఇవన్నీ గమనించని ఓ వ్యక్తి ఏకంగా పిడుగుతోనే సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఇంకేముందు అనుకున్నదంతా అయింది. చెన్నై తురైపాక్కానికి  చెందిన రమేష్‌(45) బుధవారం  తన స్నేహితుని రొయ్యల చెరువు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ఈక్రమంలో పిడుగులు పడుతుండటాన్ని గమనించిన రమేష్‌ తన సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకోబోయాడు. దురదృష్టవశాత్తు అతనిమీద పిడుగు పడింది.దీంతో రమేష్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయాన్నీ కుటుంబసభ్యులకు తెలియజేశాడు రమేష్ స్నేహితుడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపంచారు.

SHARE