ఏసీబీ ఎదుట హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యే…

74

THE BULLET NEWS (NELLORE)-బినామీ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ఎదుట హాజరుకాలేదు. ఆయన తరఫున లాయర్‌ సుధాకర్‌రెడ్డి ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌‌కి చెందిన అక్రమాస్తులు… ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లతో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ సందర్భంగా లాయర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ అక్రమాస్తులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్యేను ఇరికించాలని చూస్తోందన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటి ఆపరేషన్ కారణంగా ఏసీబీ ఎదుట హాజరుకాలేదని అధికారులకు చెప్పగా ఈనెల 29న ఎమ్మెల్యే హాజరుకావాలని ఏసీబీ అధికారులు చెప్పారని ఆళ్ల తరపు లాయర్‌ పేర్కొన్నారు.

 

ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే తన ఆస్తులను చూపించారా లేదా అని ఏబీసీ పరిశీలించింది. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు లేవని గుర్తించిన ఏసీబీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అందించింది. అలాగే ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇచ్చేందుకు రావాల్సిందిగా ఆళ్లకు ఏసీబీ సమాచారమిచ్చింది. మంగళవారం ఉదయం 11గంటలకు రామకృష్ణారెడ్డి ఏసీబీ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే

SHARE