హైవేలపై ప్రమాదాలు జరిగితే మీరే బాధ్యత వహించాలి – డాబా నిర్వాహకులతో ఎస్ ఐ శ్రీనివాసులు రెడ్డి

94

The bullet news ( Manubolu )- జాతీయ రహదారుల వెంబడి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మనుబోలు ఎస్ ఐ శ్రీనువాసుల రెడ్డి నడుం బిగించారు.. హైవేలపై ఢాబాలు నిర్వహిస్తున్న వారితో ఆయన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిర్వహిస్తున్న హోటళ్లను రాత్రి గం.10 తర్వాత కచ్చితంగా మూసివేయాలన్నారు. హోటళ్లలో మద్యం విక్రయించడం, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తమ తమ హోటళ్ల పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరుగుకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందన్నారు. హోటల్ వద్ద ప్రమాదాలు జరిగేతే దానికి బాద్యులుగా యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.. అలాగే వాహనాల పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసుకోవలని సూచించారు.

SHARE