నా ఇష్టం.. నేను స్కూల్ కి రాను.. – ఓ టీచర్ నిర్లక్ష్యపు సమాధానం..

95

THE BULLET NEWS (MARRIPADU)-” మీరెవరు నన్ను అడగడానికి.. నా ఇష్టం నేను స్కూల్ కి రాను.. ఎం చేసుకుంటారో చేసుకోండి.. ఎంవిఓ కి చెప్పుకుంటారా..? చెప్పుకోండి అంటూ” ఈ టీచర్ విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు..

మర్రిపాడు మండలం రామానాయుడు పల్లి ఎస్సి స్కూల్ లో నరహరి అనే ఏకోపాధ్యాయుడు ఉన్నాడు.. దాదాపు 20 మంది దాకా ఉండే ఈ స్కూల్ లో ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఆయన కూడా సెలవు పెట్టడంతో విద్యార్థులకు తరగతులు జరగలేదు.. బయట ఆడుకుంటున్న పిల్లలని చూసిన వాళ్ళ తల్లిదండ్రులు టీచర్ నరహరికి ఫోన్ చేసి అడిగారు.. మీకు చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంఈఓ కి కాల్ చేసి అడగండి.. నేను సెలవు లో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. మండలంలోని ప్రభుత్వ స్కూల్స్ పై ఎంఇఓ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఉపాద్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు.. టీచర్స్ ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వ స్కూల్స్ తో పిల్లలకి నాణ్యమైన విద్య ఎలా దొరుకుతుందని వారు ప్రశ్నింస్తున్నారు.. విద్యార్థులు లేరంటూ పాఠశాలలు మూసేస్తుంటే.. ఉన్న విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించకుండా, ఉపాద్యాయుడు స్కూల్ ఎగ్గొట్టడం ఏంటని వారు వాపోతున్నారు.. టీచర్ నరహరి పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు..

SHARE