నెల్లూరు విఆర్సీలో మాక్స్ ఫిట్ క్రికెట్ లీగ్ (ఎంసీఎల్) గ్రాండ్ లాంఛ్

87

The bullet news (Nellore)_  మ్యాక్స్ ఫిట్ జిమ్.. నెల్లూరు నగర యువతకు, ప్రొఫెషనల్స్ కు, ప్రముఖులకు, ఈ పేరు తెలియని వారంటూ ఉండరు.. గత కొన్నేళ్లుగా నగర ప్రజలకు ఫిట్ నెస్ అందిస్తున్నఈ సంస్థ ఆ ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి కూడా నగర వాసులకు ఎంజాయిల్ పుల్ టిప్స్ అందిస్తోంది.. మాక్స్ ఫిట్ జిమ్ నిర్వాహకులు సాయి ఆధ్వర్యలో ఇవాళ విఆర్సీ మైదానం నిర్వహించిన ఎంసీఎల్ క్రికెట్ లీగ్ ను ప్రముఖులు గ్రాండ్ గా లాంఛ్ చేశారు.. క్రికెట్ ప్రియులు, ట్రైనర్స్, నగర వాసుల మధ్య కార్పోరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి, ప్ర‌ముఖ అంగాలజిస్ట్ వైద్య నిపుణులు శ్రీనివాస్, డిపార్ట్ మెంట్ ఆప్ పారెన్సీక్ మెడిసెన్ ఇన్ చార్జి ప‌ముజుల సురేష్ లు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆనం రంగమయూర్, శ్రీనివాసన్ లు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆనం రంగమయూర్ మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బాడీకి ఫిట్ నెస్ చాలా అవసరమన్నారు.. ప్రస్తుత రోజుల్లో డబ్బు కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నరన్నారు.. నగర వాసులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు మాక్స్ ఫిట్ జిమ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.. మేనేజర్ సాయి మాట్లాడుతూ బిజి లైప్ లో వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. కనీసం రోజుకు రెండు గంటలపాటు వ్యాయామం చేసినా మనిషి ఉత్సాహంగా ఉంటారన్నారు.. నగర వాసులకు ఫిట్ నెస్ పై అవగాహన కల్పించడం కోసం ఈ క్రికెట్ లీగ్ ను ఏర్పాటు చేశామన్నారు.. రానున్న రోజుల్లో మాక్స్ ఫిట్ ఆధ్వర్యంలో మరన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని సాయి తెలిపారు.. తాము చేస్తున్న ఈ కార్యక్రమానికి తమ అభిమాన నాయకుడు, ఆనం రంగమయూర్ రెడ్డి చాలా ఆనందంగా ఉందన్నారు.. ఆశ్రా జిల్లా అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ యువతకు ఫిట్ నెస్ చాలా అవసరమన్నారు..

SHARE