ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులో నెల్లూరుకు తొలి స్థానం ‍‍‍.. మేయర్ అబ్దుల్ అజీజ్

101

The bullet news  (Nellore)_ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.. 3వ వార్డు దీన్ దయాళ్ నగరులో మంగళవారం నిర్వహించిన దళిత తేజం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళితులకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు.. మేయర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో 103 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను నగరానికి కేటాయించి దళితుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఆయా నిధులను కార్పోరేషను ఆధ్వర్యంలో నగరంలోని దళిత వాడల అభివృద్ధికీ, ప్రజల సంక్షేమానికి సక్రమంగా వినియోగిస్తున్నామని మేయరు వెల్లడించారు. జాలరి వృత్తి ప్రధానంగా కలిగి ఉన్న స్థానికులకు ప్రస్తుతం ఉపాధి కరువయిందనీ, వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకోసం ప్రత్యేకంగా వృత్తి నైపుణ్యా శిక్షణ కేంద్రం, కమ్యూనిటీ భవనాలను ఈ ప్రాంతంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని అధికారులను మేయరు ఆదేశించారు. కార్యక్రమంలో టిడిపి నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు అనూరాధ, ఆనం జయకుమార్ రెడ్డి, ఖాజావలి, కార్పొరేటరు పొత్తూరు శైలజ, స్వర్ణా వెంకయ్య, మామిడాల మధు, రవీంద్ర, ఎసి నాయుడు, సునీల్, కృష్ణ, నరసింహులు, ప్రసాద్, రమేష్ బాబు, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

SHARE