క్రేజీ కార్స్ షోరూమ్ ప్రారంభించిన మేయర్

230

నాణ్యతాయుతమైన ఆటో మొబైల్ ఉపకరణాలను మెట్రో నగరాల స్థాయిలో నెల్లూరు వాసులకు అందించడం అభినందనీయం అని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక వేదాయపాలెం కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రేజీ కార్స్ షోరూంను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆటో మొబైల్ రంగంలో సుమారు యాభై ఏళ్లుగా నగరంలో సేవలు అందిస్తూ వాహనదారుల మన్ననలు పొందారని షోరూం యజమాని సమిఉల్లాను ప్రశంసించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా కార్లకు అవసరమైన స్టీరియో, సీట్లు, ఇతర ఉత్పత్తులను అనుకూలమైన ధరలకు అందించడంలో క్రేజీ షోరూం ప్రసిద్ధి చెందిందని, నగరవాసులు ప్రోత్సాహం ఇవ్వాలని మేయర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షంషుద్దీన్, మౌలానా, సమీర్, షోరూం నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

SHARE