పర్యావరణాన్ని కాపాడుదాం – మేయర్ అబ్దుల్ అజీజ్ పిలుపు

71

The Bullet News – Nellore

విశిష్టమైన వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక ప్రతిమలనే అందరం పూజిద్దామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. స్థానిక మూలాపేట ఎంసిపిఎస్, కొండాయపాలెం డొంక ఎంసిపిఎస్ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన బంకమట్టి, కూరగాయల వినాయక ప్రతిమలను మేయరుకు మంగళవారం బహూకరించారు. నగర పాలక సంస్థలోని మేయరు ఛాంబరులో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను మేయరు మెచ్చుకుని ప్రశంసించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడంలో నగర ప్రజల్లో మంచి చైతన్యం వస్తోందనీ , ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రచారం చేయాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో నిర్మితమైన విగ్రహాలతో నదీజలాలన్నీ కలుషితమై, పర్యావరణానికి తీరని నష్టం చేస్తాయని మేయరు వివరించారు. ప్రముఖ వ్యాపార, విద్యా, సేవా సంస్థలు నగర వ్యాపితంగా విరివిగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయాలని మేయరు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకులు అనూరాధా, ప్రైమరీ స్కూల్స్ కన్సల్టెంట్ ఇందుప్రియ ,ఉపాధ్యాయులు సునీత, రమేష్ కుమార్, పావని, మార్కండేయులు, ప్రతిమ, గీత, విద్యార్థులు ధ్యానిక, పరమేశ్వరి, అబుల్ ఫయాజ్, అర్మాన్ ఇలాహి, చంద్రిక, సారిక తదితరులు పాల్గొన్నారు..

SHARE