ఉత్తమ జీవితాన్ని ఎలా గడపాలో ఉపవాసాలు నేర్పుతాయి.. మేయర్

151

THE BULLET NEWS (NELLORE) -విశృంఖలత్వం చోటుచేసుకున్న వాతావరణాల్లో, ఉపవాసం అనే ప్రక్రియ వ్యక్తులకు స్వీయ నియంత్రణ నేర్పి, సహనం, సంయమనాలను అందిస్తుందని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని స్థానిక నవాబుపేటలోని పెద్ద మసీదులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దీక్ష విరమణ ప్రార్ధనల్లో మేయరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసపు విధులు కేవలం నెల రోజులకు పరిమితం కాదనీ, సంవత్సరాంతం ఎలా ఉత్తమ జీవనం సాగించాలో బోధించే శిక్షణా కాలంగా గుర్తించాలని సూచించారు. ఉపవాసాలు మనిషి జీవన విధానంలో పటిష్టమైన క్రమశిక్షణ నేర్పుతాయనీ, సాటివారి ఆకలి బాధలను గుర్తించేందుకు ఉపవాసాలు నిర్దేశించారని ఆయన వెల్లడించారు. సత్ప్రవర్తన, క్రమశిక్షణలను నేర్పించే రంజాన్ మాసపు విలువను ముస్లిం సోదరులందరూ గ్రహించి ఉన్నత జీవనంవైపు సాగాలని మేయరు కోరారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి మంచి నీటిని సేవించి ఉపవాస దీక్షను మేయరు విరమించారు. ఈ కార్యక్రమంలో గౌస్ మొహిద్దీన్, హుస్సేన్ బాషా, మహమ్మద్, నవాజ్, షంషుద్దీన్, సాబీర్ ఖాన్, పాషా మొహిద్దీన్, సయ్యద్ ఇక్బాల్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

SHARE