రేపో, మాపో సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి ఖాళీ – ఎమ్మెల్యే కాకాణి…

110

THE BULLET NEWS (SARVEPALLI)-నెల్లూరుజిల్లాలో టిడిపిని బ్రష్టు పట్టించడమే లక్ష్యంగా మంత్రి సోమిరెడ్డి పనిచేస్తున్నారని, ఆయన కోరుకుంటున్నట్లు నేడో రేపో సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా టీడీపి ఖాళీ అవ్వబోతోందన్నారు వైసిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.. టీడీపీ అధికారంలో ఉన్నా.. జగన్ పై నమ్మకంతో, నాపై విశ్వాసంతో వైసిపిలో చేరుతున్నారన్నారు.. ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నానని కాకని అన్నారు. అధికార పార్టీ నాయకులు, పార్టీలో చేరికల పేరుతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.. పార్టీలోకి వస్తే, పెన్షన్లు, ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, రుణాలు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటూ, ప్రజలను స్థానిక నాయకులు ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.. పార్టీలోకి తీసుకు వస్తే, స్థానిక నాయకులకు, నీరు-చెట్టు లాంటి కాంట్రాక్టులు ఇస్తామని, స్థానిక నాయకులకు నియోజకవర్గ పెద్దలు హామీ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు..

SHARE