జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి జవహర్

101

The bullet news ( Nellore ) _ ఆంధ్రుల మనోభావాలను బిజేపీ దెబ్బతీస్తోందని రాష్ట ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ అన్నారు.. నెల్లూరు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మిత్రబందాన్ని పాటించడం వల్లే ఇన్నాళ్లు సహనంతో ఉన్నామనిన ఆయన అన్నారు.. ఆంద్రుల ఆత్మగౌరవమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం తప్ప అధికారం కాదన్నారు.. ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటే కాంగ్రెస్ కు పట్టిన గతే బిజేపికి కూడా పడుతుందని హెచ్చరించారు.. పార్లమెంట్ లో ఏపీ కోసం పోరాడుతున్న ఎంపీలకు మద్దతుగా సంఘీభావ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.. ఇదే సమయంలో జగన్, రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. జగన్ అజ్ణానని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.. జగన్ కు అధికార దాహం తప్ప రాజకీయాలపై అవగాహన లేదన్నారు.. ఐరెన్ లెగ్ గా ఉన్న రోజకు వచ్చె ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు..

SHARE