వ్య‌వ‌సాయ రంగంలో సాంకేతిక‌త‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త మాదే – మంత్రి సోమిరెడ్డి

105

The bullet news (Sarvepalli)_ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో దళారి వ్యవస్థ లేకుండా సాంకేతికతతో పారదర్శకత తీసుకొచ్చిన ఘ‌న‌త త ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌ని వ్య‌వ‌సాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లిలో ఏర్పాటు చేసిన‌ జన్మభూమి- మా ఊరు కార్య‌క్ర‌మంలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిన ఘనత త‌మ ప్రభుత్వానిదేనన్నారు.. ప్రతి రైతుపొలంలో భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటు భూసార సర్టిఫికెట్లు జారీ చేసి అవసరమైన జింక్, బోరాన్ ఉచితంగా అందజేస్తున్నామ‌న్నారు. రైతులు ఎక్కడి నుంచి అయినా సెల్ ఫోన్ సాయంతో ఆపరేట్ చేసే అత్యాధునిక మోటార్లను ఉచితంగా అన్నదాతలకు అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. అనంత‌రం లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, చంద్రన్న కానుకలు, రైతులకు రైతురథాల పంపిణీ చేశారు.. సర్వేపల్లి నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి తాజాగా రూ.15 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక టీడీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

SHARE