ఆయనకు బుద్ది రావాలనే ఇంత దూరం వచ్చా – జిల్లా కోర్టులో మంత్రి

97

The Bullet News – Nellore

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై సర్వేపల్లి శాసనసభ్యులు వై సిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండేళ్ల క్రితం చేసిన ఆరోపణలు పై జిల్లా కోర్టులో మరో కేసు దాఖలైంది.. కక్షదారులుగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈవాల కాకాణిపై క్రిమినల్ డిఫర్మేషన్ వేశారు.. జిల్లా కోర్టు ప్రాంగణంలో ని 4 వ అదనపు న్యాయమూర్తి వద్ద మంత్రి సోమిరెడ్డి తమ వాదనను వినిపించారు. గత 2016 డిసెంబర్ 23 న సోమిరెడ్డి కుటుంభం పై సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు… సోమిరెడ్డి కి విదేశాల్లో బ్యాంకు ఖాతాలు …పాస్పోర్ట్ లు, వ్యాపారాలు ఉన్నాయని అప్పట్లో కాకాణి ఆరోపించారు.. దానిపై మంత్రి సోమిరెడ్డి సుమారు రూ 5 కోట్లకు సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు… ఇవాళ మరోసారి అదే కేసుకు సంబంధించి క్రిమినల్ కేసుపెట్టాలంటూ 4 వ అదనపు జిల్లా మాజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.. సోమిరెడ్డి ఫిర్యాదు ను స్వీకరించడం పై మంత్రి మీడియా తో మాట్లాడారు. నాకు, నా కుటుంబానికి విదేశాల్లో నకిలీ పాస్ పోర్టులతో వెయ్యి కోట్ల ఆస్తులు అక్రమంగా ఉన్నాయని, బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని ఇమ్మిగ్రేషన్ పత్రాలతో సహా
నకిలీ డాక్యుమెంట్లతో తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. నా రాజకీయ చరిత్రలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి అన్నారు. ఆయన అసత్య ఆరోపణలు చేసిన రోజు మా అభిమానులు, కుటుంబసభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పడిన బాధ లోకానికి తెలియాలనే ఇంతదూరం వచ్చానన్నారు. ఆయన చూపిన పత్రాలు నకిలీవని తెలిశాక, మా సంతకాలు ఫోర్జరీవని రుజువయ్యాక, ఇమ్మిగ్రేషన్ పత్రాలు కూడా నకిలీవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చాక కూడా ఆయనపై వాళ్ల పార్టీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.. రాష్ట్ర అధ్యక్షుడిపైనే కేసులున్నప్పుడు జిల్లా అధ్యక్షుడిది ఏముందిలే అనే నిర్లక్ష్యం వైకాపా సిద్ధాంతాల్లో ఒకటిగా కనిపిస్తోందని విమర్శించారు.

SHARE