మంత్రి సోమిరెడ్డి చొరవ – సర్వేపల్లి నియోజకవర్గ మారుమూల రోడ్లకు మహర్దశ..

144

The bullet news (Sarvepalli)-  పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. అలాంటి పల్లెల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, సరైన రహదారులు, మౌలిక వసతులు ఉన్నప్పుడే అవి అన్ని రంగాల్లో అభివ్రుద్ది చెందినట్లు.. అలాంటి పల్లెలకు మహర్దశ పట్టుకుంది.. ఎన్నోఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలకు కలగా ఉన్న రోడ్లు సాకారమైంది.. వ్యవసాయశాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మారుమూల రోడ్లకు సైతం మహర్దశ పట్టుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.4.73 కోట్లు మంజూరు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రూ.14.46 కోట్లు మంజూరు కాగా అందులో ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికే రూ.4.73 కోట్లు మంజూరు కావడం విశేషం. పొదలకూరు మండలంలోని నావూరుపల్లి ఎస్సీ కాలనీకి అప్రోచ్ రోడ్డుకు రూ. 85 లక్షలకు మంజూరయ్యాయి.. అలాగే ముత్తుకూరు మండలం ఆముదాలపాడు రోడ్డుకు రూ.115 లక్షలు, మనుబోలు-పొదలకూరు రోడ్డు నుంచి జట్లకొండూరు ఎస్సీ కాలనీకి రోడ్డు రూ.35 లక్షలతో పాటు ముత్తుకూరు మండలం మామిడిపూడి ఎస్సీ కాలనీ రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం రూ.62 లక్షలు మంజూరు చేసినట్లు మంత్ర తెలిపారు.. ఈ బ్రిడ్జి నిర్మాణం అక్కడి ప్రజల కల.. ఇది సాకారం కావడంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.. అలాగే ముత్తుకూరు మండలం దొరువులపాళెం పంచాయతీ వెంకన్నపాళెం ఎస్సీ కాలనీకి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.36 లక్షలు, టీపీ గూడూరు మండలంలోని నరుకూరు-టీపీ గూడూరు రోడ్డు నుంచి పాపిరెడ్డిపాళెం మీదుగా చిన్నచెరుకూరు-కాకుపల్లి తారు రోడ్డు పున్నర్నిర్మాణానికి రూ.70 లక్షలు, అదే మండలంలోని చెన్నపల్లిపాళెం నుంచి కొత్తపాళెం తారురోడ్డు పునర్నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు అయినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయం వివరాలు వెల్లడించింది.. వీటితో పాటు మరిన్ని అభివ్రుద్ది పనులకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే అవి కూడా కార్యరూపం దాల్చనున్నట్లు మంత్రి సోమిరెడ్డి తెలిపారు..

SHARE